తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి జీఎం కార్యాలయం ముందు కార్మికుల నిరాహార దీక్ష - singareni news

సింగరేణి కార్మికులకు సింగరేణి లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలని కార్మిక సంఘం నాయకులు, కార్మికులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. కార్మికుల సమస్యలను డిమాండ్​ చేశారు.

singareni employees protested in manchirial district
సింగరేణి జీఎం కార్యాలయం ముందు కార్మికుల నిరాహార దీక్ష

By

Published : Sep 15, 2020, 6:16 PM IST

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకులు, కార్మికులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట నిరాహారదీక్షను చేపట్టారు. సింగరేణి లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలని, లాక్​డౌన్ సమయంలో కోత విధించిన సగం జీతం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

శ్రీరాంపూర్ ఏరియాలోని కార్మికులకు ఇంటి కిరాయిలో పది శాతం ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. దీంతోపాటు తదితర కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: సెప్టెంబర్​ 17న తెలంగాణ విలీన దినోత్సవం జరపాలి: తమ్మినేని

ABOUT THE AUTHOR

...view details