Collected money from the unemployed: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి ఎస్ అండ్ పీసీ విభాగంలో ఉద్యోగం చేస్తున్న మహేష్, పలువురు నిరుద్యోగులకు సింగరేణిలో క్లర్క్, ప్రైవేటు సెక్యూరిటీ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. వారి నుంచి సుమారు 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. వారిని ఎంతకీ ఉద్యోగాల్లో పెట్టించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిరగడంతో అనుమానం వచ్చింది.
దీంతో బాధితులు మందమర్రి లోని ఎస్ అండ్ పీసీ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. అనంతరం అతనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పై అధికారులు మహేష్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో భూమి కొనుగోలు, ప్రైవేటు ఉద్యోగాలు పెట్టిస్తామని కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేయడంతో మహేష్‌ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అనంతరం అతనిపై పీడీ చట్టం కూడా ప్రయోగించారు.