తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్​

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా సింగరేణి ఫైనాన్స్​ డైరెక్టర్​ బలరాం మొక్కలు నాటారు. ప్రతి ఏటా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో లక్షలాది మొక్కలు నాటుతున్నామని... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు.

Singareni director planted trees as part of the Green India Challenge in manchirial district
గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్​

By

Published : Oct 10, 2020, 3:23 PM IST

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్​ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా సింగరేణి ఫైనాన్స్​ డైరెక్టర్ బలరాం మొక్కలు నాటారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లోని నందనవనం పార్క్​ సమీపంలోని ఖాళీ స్థలంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఏటా సింగరేణి ఆధ్వర్యంలో లక్షలాది మొక్కలు నాటుతున్నామని... అందులో 90 శాతం మొక్కలు పచ్చదనాన్ని పంచుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా తాను సొంతంగా 10 వేల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బలరాం తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా జీఎం లక్ష్మీనారాయణ హాజరై హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మనుషుల జీవన ప్రమాణాలు పెరగాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సింగరేణి పైనాన్స్​ డైరెక్టర్ బలరాం సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్​లో కూడా ఇదే స్పూర్తిని కొనసాగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'భూ​ వివాదంలో తలదూరుస్తున్న కార్పొరేటర్​పై చర్యలు తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details