సింగరేణిలో లాభాల వెలుగులు 50 ఏళ్లగా నష్టాల బాటలో నడిచిన మందమర్రి ఏరియా సింగరేణి బొగ్గు గనులు లాభాల బాట పట్టడం హర్షణీయమని ఏరియా జీఎం రాఘవులు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే 5 గని వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 12 రోజులు ముందుగానే చేరుకోవడంతో గని ఆవరణలో సంబురాలు జరుపుకున్నారు. సత్తా చాటిన కార్మికులను, ఉద్యోగులను జీఎం అభినందించి... నగదు పంపిణీ చేశారు. గడిచిన మూడు నెలల్లో 45 కోట్ల రూపాయల లాభం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.