దేశంలో రోజురోజుకు పెరుగుతోన్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలు తమ వంతు తోడ్పాడు అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి యాజమాన్యం, కార్మిక కుటుంబాలు కలిసి కొవిడ్-19పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా నివారణపై ప్రజలకు సింగరేణి అవగాహన - కరోనాపై తెలంగాణ సింగరేణి అవగాహన
ప్రజల ప్రాణాలు హరిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. కొవిడ్-19పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం తమ వంతు సాయం చేస్తోంది.
కరోనా వ్యాప్తిపై ప్రజలకు సింగరేణి అవగాహన
కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు కార్మిక కుటుంబాలు 50 వేల కరపత్రాలను ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేశారు. ప్రత్యేక ఆటో ద్వారా తమ ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు.
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మాస్కులను తయారు చేస్తున్నారు. కార్మికులు చేతులు శుభ్రంగా కడుక్కునే విధంగా అందుబాటులో శానిటైజర్లు ఉంచారు.
- ఇదీ చూడండి:రాష్ట్రంలో 16కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు