కరోనా వైరస్ నిర్మూలన కోసం సింగరేణి గనుల్లో యాజమాన్యం అనేక చర్యలు చేపట్టింది. దీనిపై కార్మికుల్లో కూడా పూర్తిస్థాయిలో చైతన్యం తీసుకురావటంలో విజయం సాధించారు. ఈ క్రమంలో గనులు, కార్మికవాడలో తీసుకుంటున్న చర్యలు సక్రమంగా కొనసాగుతున్నాయా.. లేదా అంటూ కార్మికులకు మందమర్రి జీఎం రమేశ్ రావు స్వయంగా ఫోన్ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇలా తెలుసుకోవటం వల్ల సంబంధిత అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక్కో కార్మికుడితో సుమారు 2 నుంచి 10 నిమిషాల సేపు మాట్లాడారు.
సింగరేణి గనుల్లో సమస్యలపై జీఎం ఆరా - Singarani GM Interact with Labours
హలో... మీ కార్మిక వాడలో పరిస్థితి ఎలా ఉంది? స్థానిక అధికారులు మీకు అవసరమైన సౌకర్యాలు సమకూరుస్తున్నారా? అంటూ మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రమేష్ రావు కార్మికులతో చరవాణిలో ముచ్చటించి వివరాలు తెలుసుకున్నారు.
సింగరేణి గనుల్లో సమస్యలపై జీఎం ఆరా