సింగరేణి కాలరీస్‌లో ఈపీ ఆపరేటర్ల( సిగ్నలింగ్ వాహనాల డ్రైవర్ల) కోసం నియామక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను జిల్లాలోని సింగరేణి మైదానంలో మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రారంభించారు.
సింగరేణి ఈపీ ఆపరేటర్ల నియామక ప్రక్రియ ప్రారంభం - సింగరేణి తాజా వార్తలు
సింగరేణి వ్యాప్తంగా ఈపీ ఆపరేటర్ల కోసం చేపట్టిన నియామక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షను మంచిర్యాల జిల్లాలోని సింగరేణి మైదానంలో మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రారంభించారు.
సింగరేణి ఈపీ ఆపరేటర్ల నియామక ప్రక్రియ ప్రారంభం
సింగరేణి వ్యాప్తంగా 210 పోస్టులు ఉండగా రెండు వేల మంది అంతర్గత సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల డ్రైవింగ్ టెస్ట్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తూ.. టీవీల ద్వారా ప్రసారం చేస్తున్నారు. అభ్యర్థులు డమ్ముల మధ్యనున్న ఖాళీల గుండా వాహనాలను నడుపుతూ తమ ప్రతిభను చాటుతున్నారు.
ఇదీ చదవండి:నాగార్జునసాగర్ ఉపపోరులో మహిళా ఓటర్లే కీలకం