తెలంగాణ

telangana

ETV Bharat / state

పోకిరీల సమాచారం ఇవ్వండి... వెంటనే స్పందిస్తాం - RAMAGUNDAM POLICE COMMISIONERATE

మహిళల భద్రత కోసం షీ టీం ఆధ్వర్యంలో 2కే రన్ జరిగింది. స్త్రీలకు ఇబ్బందులు ఎదురైతే  వాట్సాప్ నెం. 63039 23700​ ద్వారా సమాచారం ఇస్తే తక్షణం స్పందిస్తామని మంచిర్యాల డీసీపీ తెలిపారు.

పోకీరీల సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తాం : డీసీపీ రక్షిత

By

Published : Mar 30, 2019, 12:44 PM IST

సమాజానికి అసలైన భద్రతను అందించేది స్త్రీలే : సీపీ సత్యనారాయణ
మహిళా సాధికారతే లక్ష్యంగా మంచిర్యాలలో షీ టీం ఆధ్వర్యంలో 2కే రన్ జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ రన్ ఐబీ చౌరస్తా నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం వరకు రెండు కిలోమీటర్లు సాగింది. రామగుండం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ రక్షిత కృష్ణమూర్తి జెండా ఊపి పరుగు​ను ప్రారంభించారు.

అసలైన భద్రత ఇచ్చేదిస్త్రీలే

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ పోలీస్ మహిళల రక్షణ కోసం షీటీంలను ఏర్పాటు చేసిందని సీపీ సత్యనారాయణ తెలిపారు. సమాజానికి అసలైన భద్రతను అందించేది స్త్రీలే అని కొనియాడారు.
స్త్రీలకు ఇబ్బందులు ఎదురైతే హాక్ఐ యాప్, వాట్సాప్ నెం. 63039 23700​ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని రక్షిత కృష్ణమూర్తి సూచించారు. షీ టీం ఏర్పాటు తర్వాత మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు తగ్గుముఖం పట్టాయని డీసీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details