మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శ్రీ సీతా రాముల కల్యాణాన్ని కోదండ రామాలయంలో నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం 20 మందితోనే వివాహాన్ని జరిపించారు. ప్రతి ఏడాది భక్తులతో కళకళ లాడే శ్రీ కోదండ రామాలయం ఈ సారి జనాలు లేక వెలవెల బోయింది.
నిరాడంబరంగా శ్రీ సీతారాముల కల్యాణం - SEETHARAAMULA KALYANAM
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో శ్రీ సీతా రామచంద్ర వారి కల్యాణాన్ని నిరాడంబంరంగా జరిపించారు. ఆలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించగా... భక్తులు బయట నుంచే మెుక్కుకుని వెనుదిరిగారు.
శ్రీ సీతా రాముల కల్యాణోత్సవం
పోలీసులు ఆలయంలోకి వెళ్లడానికి ఒక్కరికి కూడా అనుమతి ఇవ్వలేదు. కొంతమంది భక్తులు బయటి నుంచే మొక్కుకుని వెనుదిరిగారు. పట్టణ ప్రజలంతా సీతారాముల కల్యాణాన్ని టీవీల్లోనే వీక్షించారు.