మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఎస్బీఐ బ్యాంకు అధికారులు, సిబ్బంది రైల్వే స్టేషన్కు చేరుకుని ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రయాణంలో వడదెబ్బతో ఎవరు చనిపోకుండా మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు పదిహేను వందల మజ్జిగ ప్యాకెట్లు అందజేసినట్లు మంచిర్యాల చీఫ్ మేనేజర్ గోపాలకృష్ణ తెలిపారు.
మంచిర్యాల రైల్వే స్టేషన్లో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ - SBI BANK OFFICRES DISTRIBUTED BUTTER MILK PACKETS
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. రైల్వే స్టేషన్లో ఎండ వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్న ప్రయాణికుల కోసం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు.

మంచిర్యాల రైల్వే స్టేషన్లో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ