మంచిర్యాల జిల్లా కేంద్రం రెడ్డి కాలనీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఆవరణంలో కార్ రుణ మేళాలను జిల్లా సంయుక్త పాలనాధికారి సురేందర్ రావు ప్రారంభించారు. మారుతి, టాటా, మహేంద్ర, ఫోర్డ్ , హుందాయ్, నెక్సా కారు కంపెనీల వాహనాలను రుణ మేళలో ప్రదర్శించారు. గత ఏడాది ఈ మేళాలతో వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని మంచిర్యాల స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. తమ బ్యాంకు శాఖ ద్వారా కారు రుణం పొందే వారికి అక్టోబర్ 31 8.65 శాతం వడ్డీ రేట్లకు కార్ లోన్ ఇస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.
'అతి తక్కువ వడ్డీ రేట్లకే కార్లు' - Only the lowest interest rates
దసరా, దీపావళి పండగ కార్ లోన్ మేళాను అతి తక్కువ వడ్డీ రేట్లకు అందిస్తోంది భారతీయ స్టేట్ బ్యాంక్. పండుగల సందర్భంగా 8.65 శాతం వడ్డీ రేట్లకు కార్ లోన్ ఇస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.

'అతి తక్కువ వడ్డీ రేట్లకే కార్లు'