మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న అక్రమ దారులపై కొరడా ఝుళిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నస్పూర్ పురపాలిక పరిధిలో సర్వే నంబరు 42, 64లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన 31 ఇళ్లను అధికారులు జేసీబీలతో తొలగించారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత - Revenue officials demolished illegal constructions in Naspur municipal corporation
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నస్పూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత