అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ... మంచిర్యాల జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు మూడు రోజుల పాటు విధులు బహిష్కరించారు. సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే ప్రజలంతా... చిన్న చూపు చూస్తున్నారన్నారు. సాంకేతిక సమస్యలను ప్రజలు అర్థం చేసుకోకుండా దాడులకు దిగితున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తమకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. రెవెన్యూ ఉద్యోగులపై దాడులు చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు.
తహసీల్దార్ హత్యకు నిరసనగా 3 రోజులు విధుల బహిష్కరణ - తహసీల్దార్ హత్యకు నిరసనగా 3 రోజులు విధుల బహిష్కరణ
మంచిర్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగులు మూడు రోజుల పాటు విధులను బహిష్కరిస్తూ... ఆందోళనకు దిగారు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ హత్యకు నిరసనగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
REVENUE EMPLOYEES 3 DAYS DUTIES BOYCOTT FOR MRO VIJAYAREDDY DEATH