మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ప్రవళ్లిక స్థానిక ఆశ కార్యకర్తను టీకా కోసం సంప్రదించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో లేకపోవడంతో ఆ చిన్నారికి మూడు వారాలైనా టీకా అందించలేని పరిస్థితి ఎదురవుతోందని తెలుసుకున్నారు.
Rota Vaccine: తల్లి ఫిర్యాదు.. స్పందించిన అధికారులు
తన మూడు నెలల చిన్నారికి రోటా వైరస్ టీకా ఇప్పించాలని కోరుతూ ఓ తల్లి చేసిన విజ్ఞప్తికి అధికారులు స్పందించారు. రెండు రోజుల్లో టీకాలు అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు.
ఆరోగ్య కేంద్రాలు, ఆశ కార్యకర్తల వద్ద టీకా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ 4 రోజుల కిందట మంచిర్యాల జిల్లా పాలనాధికారి భారతి హోళికేరికి మెయిల్ ద్వారా కోరారు. స్పందన లేకపోవడంతో బుధవారం కలెక్టరేట్ కార్యాలయానికి నేరుగా ఫోన్ చేశారు. దీంతో అధికారులు విషయాన్ని పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె రెండు రోజుల్లో టీకా అందుబాటులోకి తెచ్చి సమస్య పరిష్కరిస్తామని తిరిగి కార్యాలయం నుంచి అధికారులతో ఆమెకు ఫోన్ చేయించారు. వ్యాధి నిరోధక టీకాల అధికారి సైతం ఆమెకు ఫోన్‌చేసి సమస్య పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.