మంచిర్యాల జిల్లా కేంద్రంలో పురపాలక శాఖ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. హమాలివాడ రైల్వే గేట్ సమీపంలో రహదార్లను ఆక్రమించిన వ్యాపార సముదాయాల నిర్మాణాలను జేసీబీతో కూల్చివేశారు.
మంచిర్యాల పట్టణంలో అక్రమ నిర్మాణాల తొలగింపు - తెలంగాణ వార్తలు
మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ రైల్వే గేట్ సమీపంలో రహదారులపై ఉన్న అక్రమ నిర్మాణాలను మున్సిపాలిటీ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. ఆక్రమణదారులకు ఆరు నెలల కిందటే నోటీసులు ఇచ్చామని మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి తెలిపారు.
మంచిర్యాల పట్టణంలో అక్రమ నిర్మాణాల తొలగింపు
రహదార్లను ఆక్రమించిన నిర్మాణాలకు ఆరు నెలల కిందటే.. నోటీసులు అందించామని మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి తెలిపారు. చాలావరకు స్వచ్ఛందంగానే తొలగించారన్నారు. ఈ కూల్చివేతలతో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని.. దీనికి అందరూ సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 14న నిరసన దీక్ష