సూరారం కాలనీలో ఓం జెండాను వ్యక్తి ఢీకొట్టడం వల్ల మృతిచెందాడు. మేడ్చల్ జిల్లా సూరారంలో నివాసం ఉంటున్న మోహిన్ హుస్సేన్ డిగ్రీ చదువుతున్నాడు. నిన్న రాత్రి స్నేహితుడు నిఖిల్‌తో కలిసి శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ మద్యం సేవించాడు. తిరిగి వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మందేసి బైకు తోలాడు... ప్రాణాలు కోల్పోయాడు! - RASH DRIVING YOUNG BOY DEAD AT MEDCHAL
మందేశాడు. బైకు తీశాడు. మత్తులో ఇష్టానుసారంగా తోలాడు. మధ్యలో ఓ జెండాకు ఢీకొట్టాడు. చివరికి ప్రాణాలొదిలాడు. సూరారం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![మందేసి బైకు తోలాడు... ప్రాణాలు కోల్పోయాడు! RASH DRIVING YOUNG BOY DEAD AT DUNDIGAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5823914-572-5823914-1579859284962.jpg)
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి