తెలంగాణ

telangana

ETV Bharat / state

ముస్లిం చిరు వ్యాపారులకు రంజాన్​ తోఫా పంపిణీ - lock down effect

మంచిర్యాలలో ముస్లిం చిరు వ్యాపారులకు రంజాన్​ తోఫా అందించారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 150 మందికి పంపిణీ చేశారు.

ramzan kits distributed to muslims in manchiryal
ముస్లిం చిరు వ్యాపారులకు రంజాన్​ తోఫా పంపిణీ

By

Published : May 24, 2020, 2:37 PM IST

ముస్లింల పవిత్ర పండగ రంజాన్​ను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో తోఫా సేమియా కిట్లను పంపిణీ చేశారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని శ్యామలాదేవి 150 మంది ముస్లిం సోదరులకు రంజాన్​ తోఫా అందించారు.

లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ముస్లిం చిరు వ్యాపారులకు తమ వంతు సాయంగా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను శ్వామలాదేవి అభినందించారు. కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి:'కరోనా వ్యాప్తి తగ్గితేనే ఆ పథకాలు సాధ్యం!'

ABOUT THE AUTHOR

...view details