మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాజస్థానీ వాసులు విజయదశమి పండుగని వైభవంగా జరుపుకున్నారు. దసరా రోజున కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పూజలు చేశారు. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా సాంప్రదాయ దుస్తులలో గర్భా, దాండియా రాస్ నృత్యాలు చేశారు. ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన తాము ఇక్కడి సంప్రదాయాలను గౌరవిస్తామన్నారు. తమ సాంప్రదాయాలను మర్చిపోకుండా సమైక్యంగా అందరూ ఒక చోట చేరి ప్రతి ఏడాది విజయదశమి వేడుకలను జరుపుకుంటున్నామని మార్వాడీ సంఘ ప్రతినిధులు తెలిపారు.
రాజస్థానీ వాసుల ఆటపాటలు..! - మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాజస్థానీ వాసులు విజయదశమి పండుగ
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాజస్థానీ వాసులు విజయదశమి పండుగని ఘనంగా జరుపుకున్నారు. దాండియా రాస్ నృత్యాలు, ఆటపాటలతో ఆలరించారు.
రాజస్థానీ వాసుల ఆటపాటలు..!