తెలంగాణ

telangana

ETV Bharat / state

'తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి' - మంచిర్యాలలో అకాల వర్షానికి తడిసిన ధాన్యం

మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తడిసిపోవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని సకాలంలో తూకం వెయ్యకపోవడం వల్ల ధాన్యమంతా తడిసిపోయిందని వాపోతున్నారు.

rain in Telangana
తెలంగాణలో వర్షం

By

Published : May 14, 2021, 10:28 PM IST

Updated : May 14, 2021, 10:39 PM IST

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో అకాల వర్షం దంచి కొట్టింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఎండకు ఆరబెట్టిన ధాన్యం తీసుకునే లోగానే తడిసిపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్మకానికి తీసుకురాగా వర్షార్పణమైందని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం వెయ్యకపోవడం వల్ల, తూకం వేసిన ధాన్యాన్ని తరలించకపోవడం వల్ల నష్టపోయామని వాపోతున్నారు. తడిచిన ధాన్యంలో కోత విధించకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి తమకు న్యాయం చెయ్యాలని రైతులు కోరుతున్నారు.

'తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి'

ఇదీ చూడండి:కొరత లేనప్పుడు ఇంతమంది ఎలా చనిపోతున్నారు: బండి సంజయ్

Last Updated : May 14, 2021, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details