హోం క్వారంటైన్లో ఉండేందుకు అవకాశంలేని కొవిడ్ బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే దివాకర్‌రావు సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వంద పడకలతో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
వంద పడకలతో కొవిడ్ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు
కరోనా సోకిన వారి కోసం మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. వంద పడకలతో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావు పరిశీలించారు.
మంచిర్యాలలో కరోనా కేసులు
ఇక్కడ 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారని... పౌష్టికాహారంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని... ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావొద్దని... వచ్చినప్పుడు మాస్కులు కచ్చితంగా ధరించాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?