శాఖాహారం వల్ల కలిగే మేలును వివరిస్తూ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో అవగాహన ర్యాలీ చేపట్టింది. దాంతో పాటు నిత్యం ధ్యానం చేస్తే ఆనందమైన జీవితాన్ని గడపవచ్చని.. స్థానికులకు సొసైటీ సభ్యులు వివరించారు.
'ఆహారపు అలవాట్లతో వ్యాధులను అరికట్టొచ్చు' - మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ సభ్యులు ర్యాలీ చేపట్టారు. జీవహింసకు పాల్పడకుండా.. శాకాహారులుగా మారితే వచ్చే లాభాలను స్థానికులకు వివరించారు.
'ఆహారపు అలవాట్లతో వ్యాధులను అరికట్టొచ్చు'
ఆహారపు అలవాట్లతో వ్యాధులను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. మాంసాహారాల కన్నా కూరగాయలు, పప్పు దినుసుల పోషకాలే.. శరీరానికి ఎక్కువ లాభాలు చేకూర్చుతాయని వివరించారు. గాంధీజీ ఆశయాలతో అహింస మార్గాన్ని ఎంచుకొని.. శాంతి మార్గంలో పయనించాలని కోరారు.
ఇదీ చదవండి:తగ్గుతోన్న రాయితీ... భారీగా పెరుగుతోన్న సిలిండర్ రేట్లు