తెలంగాణ

telangana

By

Published : Jan 30, 2021, 12:15 PM IST

ETV Bharat / state

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

తాగు నీటి సమస్య తీర్చాలంటూ.. మంచిర్యాల జిల్లాలో మహిళలు రోడ్డెక్కారు. సర్పంచ్​తో సహా.. అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని వారు ఆరోపించారు.

Protest with empty bins for water in Vegam village in Kannepalli zone
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు

తాగునీటి సమస్యలు తీర్చాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని వీగాం గ్రామంలో మహిళలతో పాటు గ్రామస్థులు బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాగునీరు సరఫరా చేయాలని సర్పంచ్​తో పాటు అధికారులకు మొరపెట్టుకున్నా వారు స్పందించడం లేదని ఆరోపించారు.

ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి అక్కడకు చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. రెండు రోజల్లో వీటి సమస్య తీరుస్తామని సర్పంచ్ హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:కూతురిని చంపేసి.. నాలుక కోసి తినేసింది

ABOUT THE AUTHOR

...view details