తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిహారం చెల్లించాలంటూ ఆందోళన - పరిహారం చెల్లించాలంటూ ఆందోళన

విద్యుత్​ ఘాతంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ నేతకాని సంఘం ఆధ్యర్యంలో ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడంలో గోపాల్ అనే వ్యక్తి ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు చేస్తూ షాక్​తో మృతి చెందాడు.

protest for compaction in manchiryala district
పరిహారం చెల్లించాలంటూ ఆందోళన

By

Published : Dec 28, 2019, 6:04 PM IST

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెంలో ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు చేస్తూ గోపాల్​ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పరిహారంతోపాటు మృతుడి భార్యకు కాంట్రాక్ట్​ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్​ చేశారు.

స్పష్టమైన హామీ ఇవ్వాలి

జిల్లా పాలనధికారి నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు గోపాల్ మృతదేహానికి శవ పరీక్షలు చేయొద్దని ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. తహసీల్దార్ పుష్పలత, సీఐ నారాయణ నాయక్​ నచ్చచెప్పినా కుటుంబ సభ్యులు, సంఘాల నాయకులు శాంతించలేదు.

పరిహారం చెల్లించాలంటూ ఆందోళన

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

ABOUT THE AUTHOR

...view details