ఉత్తరప్రదేశ్ హాథ్రస్లో మహిళపై జరిగిన అత్యాచార ఘటనను భారతదేశం తలవంచే ఘటనగా ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెరాస మహిళా కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. 'యూపీ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ఘటనను అత్యాచారం కాదన్నారు. అక్కడి వైద్యులు అత్యాచారంగా నిర్ధారించటం సిగ్గుచేటు' అని ఎమ్మెల్యే విమర్శించారు.
భారతదేశం తలవంచే ఘటన అది: ఎమ్మెల్యే దివాకర్‌రావు - latest rally by mla divakar rao
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు తెరాస మహిళా కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. భారతదేశం తలవంచే ఘటనగా పేర్కొన్నారు. దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
భారతదేశం తలవంచే ఘటన అది: ఎమ్మెల్యే దివాకర్‌రావు
భాజపా పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి.. దేశమంతా హర్షించేలా నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు.