తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ టీకా తీసుకున్న గర్భిణి.. గర్భస్రావమైందంటూ బంధువుల ఆందోళన - pregnant woman has miscarriage after covid vaccination

కొవిడ్‌ టీకా వేయడం వల్లే.. గర్భిణికి గర్భస్రావం అయ్యిందంటూ… బంధువులు అంబులెన్స్‌ను అడ్డుకున్న ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేయడం వల్లే 5 నెలల గర్భిణీకి గర్భస్రావం జరిగి.. శిశువు చనిపోయిందని కుటుంబీకులు ఆరోపించారు.

pregnant woman has miscarriage after covid vaccination in mancherial
గర్భస్రావమైందంటూ బంధువుల ఆందోళన

By

Published : Nov 10, 2021, 10:36 AM IST

కరోనా రాకుండా ప్రజలందరూ టీకా వేసుకుంటున్నారు. వైరస్ రాకూడదని, విజృంభించకూడదనే ఉద్దేశంతోనే అధికారులు.. ప్రజలను వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు కూడా కొవిడ్​ టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఈనెల 6న మంచిర్యాల జిల్లాలోని నర్సాపూర్​ గ్రామానికి చెందిన 5 నెలల గర్భిణి కరోనా టీకా తీసుకున్నారు. స్థానిక వైద్య సిబ్బంది ఆమెకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు.

ఈ నెల 9వ తేదీన ఆమెకు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. వాహనం వచ్చే లోపు గర్భంలోని శిశువు చనిపోయిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణికి బలవంతంగా టీకావేశారని... టీకా కారణంగా ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. వ్యాక్సినేషన్​ వల్లనే అబార్షన్ అయ్యిందంటూ అంబులెన్స్​లను అడ్డుకుని ఆందోళన చేశారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆమెను చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:Pregnant Died: సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి

ABOUT THE AUTHOR

...view details