గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 16 మంది విద్యార్థులకు పాజిటివ్
18:34 July 01
కాశీపేట గురుకుల బాలుర పాఠశాలలో 16 మంది విద్యార్థులకు కరోనా..
కరోనా మహమ్మారి మళ్లీ తిరగబడుతోంది. చాప కింద నీరులా వ్యాపిస్తూ.. భయపెడుతోంది. వ్యాక్సినేషన్లు వేసుకున్నా.. వదలకుండా వెంటాడుతూనే ఉంది. తాజాగా.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. దాదాపు 10 నెలల తర్వాత కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించింది. విద్యాసంస్థలు ప్రారంభం కావడం.. మహమ్మారి మళ్లీ సోకుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 350 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. ఒకే రోజు 16 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల ఇదే పాఠశాలలో ఇద్దరికి కరోనా సోకింది. దీంతో పాఠశాలలోని విద్యార్థులందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 16 మందికి నిర్ధారణ అయింది. కరోనా బారిన పడిన విద్యార్థులను హోం క్వారంటైన్‌కు తరలించారు. మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరి అని వైద్య సిబ్బంది సూచించారు.
ఇవీ చూడండి..