మంచిర్యాల జిల్లాలో పాలిసెట్ ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా... 3,015 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అదికారులు పరీక్ష కేంద్రాల వద్ద అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.
ప్రశాంతంగా ప్రారంభమైన పాలిసెట్ పరీక్ష - polycet
మంచిర్యాల జిల్లాలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష 11గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
ప్రశాంతంగా ప్రారంభమైన పాలిసెట్ పరీక్ష
మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి తర్వాతనే గదిలోకి పంపించారు. మాస్కులు ధరించాలని సూచించారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకు జరగనుంది. కరోనా వైరస్ మూలంగా పాలిసెట్ పరీక్ష ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చింది.
ఇవీ చూడండి: రెండోరోజు జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రారంభం