మంచిర్యాల జిల్లాలో అధికారులు లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో సెక్టార్, ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎన్నికల సిబ్బందికి ఈవీఎం, వీవీ ప్యాట్, బ్యాలెట్ పత్రాలను అప్పగించారు. నియోజవర్గంలో ఏడు మండలాలు ఉండగా 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,64,275 మంది ఓటర్లు ఉన్నారు.
మంచిర్యాలలో పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. రోజులు కాస్త గంటలయ్యాయి. పోలింగ్ సాఫీగా సాగేలా అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. మంచిర్యాలలో సిబ్బందికి కావాల్సిన కిట్లు అందించారు. దశలవారిగా శిక్షణ ఇచ్చారు.
మంచిర్యాలలో పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు