మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 15 బృందాలతో దండేపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలలో, 35 ఆమ్లెట్ గ్రామాల్లో వలస కూలీలపై ప్రత్యేక సర్వే చేశారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు 70 మంది పోలీసులు ప్రత్యేక సర్వే నిర్వహించి ఇప్పటివరకు దండేపల్లి మండలానికి వచ్చిన 395 మంది వలస కూలీలను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు వెళ్లి డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి స్వయంగా మాట్లాడారు.
వలస కూలీలపై ప్రత్యేక సర్వే నిర్వహించిన పోలీసులు - వలస కార్మికులకు వైద్య పరీక్షలు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలు, 35 ఆమ్లెట్ గ్రాామాల్లోని వలస కూలీలపై డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో 15 బృందాలు ప్రత్యేక సర్వే నిర్వహించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 395 వలస కార్మికులను గుర్తించి వైద్య పరీక్షలు చేయించారు.
ఎంతమంది వచ్చారు, గ్రామ పంచాయతీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై స్పష్టమైన వివరాలను సేకరించారు. ముంబయితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్ లో ఉంటున్నారా లేదా మరోచోట ఉంటున్నారనే అంశాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్లో ఉండాలని, అనవసరంగా బయటకు వస్తే వారి పేర్లు నమోదు చేసుకుని వారిని క్వారంటైన్‌కు తరలించాలని అధికారులకు డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి సూచించారు.
ఇవీ చూడండి: 'వలస కూలీల కోసం ఆమరణ దీక్షకైనా సిద్ధం'