పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని మంచిర్యాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసులకు జోహార్లు తెలిపారు. అమరుల ఆత్మశాంతి కలగాలని స్వచ్ఛందంగా యువకులు, పోలీసులు రక్తదానం చేశారు.
పోలీసుల రక్తదాన శిబిరం.. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువత - blood donation camp
మంచిర్యాలలో పోలీసులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు, పోలీసులు స్వచ్ఛందంగా రక్తం ఇచ్చారు.
Police Mega Blood Camp in manchiryal
తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 వేలకు పైగా బాధితులు రక్తం సరైన సమయంలో అందక ఇబ్బందులు పడుతున్నారని సీపీ సత్యనారాయణ వివరించారు. రక్తనిధి కేంద్రాలలో రక్త నిలువలను పెంచడం కోసమే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.