తమ దీక్షను భగ్నం చేసి తమ దీక్షా శిబిరాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ కార్మికులు మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. తమ శిబిరాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కలవడానికి వెళ్తే ఉదయం నుంచి తమని పోలీసులు పట్టించుకోవడం లేదని... అందుకే మధ్యాహ్నం భోజన సమయంలో భోజనాలు చేసి నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ క్రమంలో భోజనాలు చేస్తున్న కొందరిని తింటుండగానే అక్కడినుంచి పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
అన్నం తింటున్న ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు - police arrested rtc workers
తమ శిబిరాన్ని పోలీసులు స్వాధీనపరచుకున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట ఆర్టీసీ కార్మికులు సహపంక్తి భోజనాలు చేశారు.
అన్నం తింటున్న ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు