మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రం అక్రమాలకు చిరునామాగా మారుతోందని.. స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా సేకరించిన ప్లాస్మా నిబంధనలకు విరుద్ధంగా ఐస్‌క్రీమ్ పార్లర్‌కి తరలించడం వివాదాస్పదమైంది. రక్తనిధి కేంద్రంలో మైనస్ 40 డిగ్రీల నుంచి మైనస్ 80 డిగ్రీల స్థాయిలో ఉన్న కూల్ ఫ్రిజ్‌లో భద్రపరచిన ప్లాస్మా ప్యాకెట్లను రక్తనిధి కేంద్రం యజమాన్యం పట్టణంలోని ఐస్‌క్రీమ్ పార్లర్‌కు తరలించింది. ఈ విషయం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లగా.. ప్లాస్మా సంచులు ఉంచిన ఫ్రిజ్‌ను తిరిగి రక్తనిధి కేంద్రానికి తీసుకువచ్చినట్టు తెలిసింది.
ప్లాస్మా సంచులు.. ఐస్‌క్రీమ్ పార్లర్లకు తరలిపోతున్నాయి! - రెడ్‌క్రాస్
మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని రక్తనిధి కేంద్రం అక్రమాలకు చిరునామాగా మారింది. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధిలో సేకరించిన ప్లాస్మా సంచులు గుట్టు చప్పుడు కాకుండా ఐస్‌క్రీమ్ పార్లర్ తరలించడం వివాదాస్పదమయింది.
2014 నుంచి ఇక్కడ ప్లాస్మా సేకరిస్తున్నారు. ఒక్కో ప్లాస్మా ప్యాకెట్‌ను దాదాపు 550 రూపాయలకు అమ్ముతారు. యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా కొంతకాలంగా ప్లాస్మా సంచులను బయటకు తరలించి అక్రమంగా అమ్ముతున్నట్టు స్థానికులు, రోగులు ఆరోపిస్తున్నారు. రక్తనిధి కేంద్రంలో ఉన్న ఫ్రిజ్‌లు చెడిపోయినా మరమ్మతులు చేయించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై డ్రగ్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. రక్తనిధి కేంద్రంలో ప్లాస్మా ను అక్రమంగా అమ్మడం లేదని రెండు ఫ్రిజ్‌లు ఉంటే అందులో ఒకటి సరిగా పనిచేయకపోవడంక వల్ల రక్తనిధి కేంద్రం సభ్యునికి చెందిన ఐస్‌క్రీమ్ పార్లర్లో ప్లాస్మా ప్యాకెట్లు భద్రపరచినట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవడి:సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్