రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టిందని అన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడిలో నిర్మిస్తున్న రైతువేదిక భవన నిర్మాణ పనులను పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావులు పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.
'రైతుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం కృషి చేస్తోంది' - రైతు వేదిక
రైతుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత అన్నారు. మంచిర్యాల జిల్లాలో రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేందుకు కేంద్ర విద్యుత్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ఎంపీ తెలిపారు. దీంతో రైతులు కరెంటు బిల్లులు కట్టలేక మరింత పేదరికంలోకి వెళ్తారని ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. పార్లమెంట్లో తాము విద్యుత్ సంస్కరణల బిల్లును వ్యతిరేకించామని తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే రైతు వేదిక పనిచేస్తుందని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం పాటు పడుతున్నారని అన్నారు.
ఇవీ చూడండి: బిల్లుల ఆమోదం ఇలా ఎప్పుడూ జరగలేదు: తెరాస ఎంపీలు