మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తోళ్ల వాగు సమీపంలో మిషన్ భగీరథ నీటి ట్యాంకు నిర్మాణానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దివాకర్ రావు భూమి పూజ చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు 15 నెలలో అందిస్తున్నామని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందిస్తోందని ఎంపీ వెంకటేశ్ పేర్కొన్నారు. అందులో భాగంగా మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు. భాజపా నాయకులు.. తెరాస ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. ప్రతిపక్షాల తప్పుడు మాటలు తిప్పి కొట్టేలా.. తెలంగాణ సర్కారు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తెలిసేలా తెరాస కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.