మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టణ ప్రగతి ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పట్టణ ప్రగతి ప్రణాళికపై ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రజలే తమ వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
'పట్టణ ప్రగతితో బస్తీలు మెరవాలి' - మంచిర్యాలలో పట్టణ ప్రగతి ప్రారంభం
పట్టణాల రూపురేఖలను మార్చటమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 11వ వార్డులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పట్టణ ప్రగతి ప్రారంభం
ఇంటిలోనే తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త బుట్టల్లో వేసుకోవాలని తెలిపారు. ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు పాలనాధికారి సురేందర్రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: '300 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం