మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ పరిధిలో 736 ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా బడుల్లో మూడు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన సాగుతోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొనసాగుతున్న ఈ తరగతులకు ప్రస్తుతం 75శాతం మందే హాజరవుతున్నారు. మొక్కుబడిగానే విద్యార్థులు డిజిటల్ బోధనలు వింటున్నారు. నిర్ణీత సమయానికి టీవీల ముందు పుస్తకాలు పట్టుకొని పాఠాలు వినేది అంతంత మాత్రమే. అయితే రోజువారి విద్యార్థుల పర్యవేక్షణ ఉపాధ్యాయులకు సవాలుగా మారింది.
అర్థం చేసుకోలేక అవస్థలు..
విద్యార్థులు ఇంటి వద్ద హోం వర్క్ చేసుకునేలా రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయులు వర్క్‌షీట్లను రూపొందించారు. జిల్లాకు వచ్చిన వర్క్‌షీట్లను రోజువారి పాఠాల అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు వాట్సప్ ద్వారా పంపుతారు. విద్యార్థులు వాటిని పూర్తి చేసి ఉపాధ్యాయులకు పంపిస్తారు. అయితే ఆ రోజు చెప్పిన పాఠానికి వర్క్‌షీట్లకు మధ్య తేడాలుంటున్నాయి. విద్యార్థులు అర్థం చేసుకోలేక తికమక పడుతున్నారు. ఉదాహరణకు మొదటి రెండు వారాల్లో రెండు అధ్యాయాలకు సంబంధించి ఐదు పాఠ్యాంశాలు ప్రసారమైతే వీటికి సంబంధించిన వర్క్‌షీట్లలో వంద పేజీల సమాచారం ఉంది. వీటిని చదివి ఉదాహరణలు అర్థం చేసుకోవడం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతోంది.
అన్నీ అంతరాయాలే..
అయిదు నెలల తర్వాత పాఠాలు మొదలైనా విద్యుత్తు సరఫరా ఆటంకాలు కలిగిస్తోంది. బోధన జరిగే సమయంలో విద్యుత్తు సరిగా ఉండటం లేదు. గ్రామాల్లో ఈ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. కొన్ని గ్రామాల్లో తల్లిదండ్రులు పిల్లలకు చరవాణులు ఇవ్వడం లేదు. టీవీలు లేక బోధనలకు దూరంగా ఉంటున్నారు.
మార్పులు చేయాలి..