లాక్డౌన్లో విద్యార్థులు చదువుకునేలా గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు. ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల చరవాణి నంబర్లు తీసుకుని వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. అందులోనే సందేహాలను నివృత్తి చేస్తున్నారు. గురుకులాల సంస్థ ఓక్స్ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ యాప్‌తో ఇప్పటికే బోధన కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో 63శాతం విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్నారు.
అన్ని తరగతులకు కామన్ సిలబస్
ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు గురుకులాల సంస్థ కామన్ సిలబస్‌ను లాక్‌డౌన్ సమయంలో రూపొందించింది. ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక అంశాన్ని తీసుకుని పాఠాలను బోధిస్తున్నారు. ఉదాహరణకు విద్యుత్తు పాఠం ఉంటే పైతరగతి వరకు అంతా కలిపి బోధన చేస్తున్నారు. ఉపాధ్యాయులకు సమయం వృథా కాకుండా ఉంటుంది. విద్యార్థులకు అదనపు జ్ఞానం లభించినట్లు అవుతుంది. చరవాణి లేని విద్యార్థులు టీ-శాట్‌తో పాఠాలు వింటున్నారు. ఇవీ రెండు అందుబాటులో లేకపోతే విద్యార్థులను చదువుకోమని ఉపాధ్యాయులు ఫోన్లు చేస్తున్నారు. ప్రతిరోజు నాలుగు అంశాలు(సబ్జెక్టులు) బోధిస్తున్నారు.