మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన 108 అంబులెన్స్‌కు ఆపద వచ్చింది. బెల్లంపల్లి వైపు తీసుకెళ్తుండగా...మందమర్రి పట్టణంలోని సింగరేణి గ్రీన్ పార్క్ వద్ద వాహనం ముందు చక్రం ఒక పక్కకు తిరిగిపోయింది. అదృష్టవశాత్తు అందులో ఉన్న ఇద్దరు వైద్య సిబ్బందికి ప్రమాదం తప్పింది. నడిరోడ్డుపై వాహనం నిలిచి పోవడం వల్ల మందమర్రి మీదుగా గోదావరిఖనికి రాకపోకలు సాగించే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అంబులెన్స్‌కి ప్రమాదం.. బయటపడ్డ సిబ్బంది - 108
ఎవరికి ఏ ప్రమాదమొచ్చినా.. ఆగమేఘాల మీద ఆస్పత్రికి తీసుకెళ్లే అంబులెన్స్‌కే ఆపదొచ్చింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా టైరు పక్కకు తిరిగిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అంబులెన్స్‌కి ప్రమాదం.. బయటపడ్డ సిబ్బంది