మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి నర్సరీల్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ జీఎం కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గుత్తేదారులకు, సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నర్సరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా - mandhamarri area news
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి నర్సరీల్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు ఆందోళన చేశారు. తమను విధుల నుంచి తొలగిస్తామని గుత్తేదార్లు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడే గుత్తేదారునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
nursery labours protest in manchiryal
గుత్తేదారుడు మారినప్పుడల్లా తమను విధుల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేధింపులకు పాల్పడే గుత్తేదారునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.