పెళ్లిళ్లలో కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పోలీసులు తెలిపారు. జెండా వెంకటాపూర్, గుల్లకోట, వెంకటరావుపేట్, లక్షెట్టిపేట్, దౌడేపల్లి గ్రామాల్లో పెళ్లి వేడుకల్లో అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొనడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పట్టించుకోకుండా వివాహం జరిపిస్తున్నారనే సమాచారంతో ఎస్సై చంద్ర శేఖర్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
పెళ్లి వేడుకల్లో నిబంధనలు బేఖాతరు.. పలువురిపై కేసు నమోదు - తెలంగాణ వార్తలు
వివాహ వేడుకల్లో కరోనా నిబంధనలు పాటించని వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. అనుమతిచ్చిన దానికంటే ఎక్కువ మంది పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ ఆపత్కాలంలో అందరూ కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
పెళ్లి వేడుకల్లో కొవిడ్ రూల్స్ బేఖాతరు, కరోనా
ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతులు తీసుకొని జరిపించాలని ఆదేశించారు. వివాహ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి;Black Fungus: కొత్తగా 5 దేశీయ ఫార్మా కంపెనీలకు అనుమతి