తెలంగాణ

telangana

ETV Bharat / state

తాజాగా 295 కరోనా కేసులు.. నలుగురు మృతి - మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల వార్తలు

మంచిర్యాల జిల్లాలో తాజాగా 295కి మందికి కరోనా సోకింది. నలుగురి వైరస్‌తో మృతి చెందారు. దీంతో మహ్మమారితో బలైన వారి సంఖ్య 34కు చేరింది. చెన్నూరు సామాజిక ఆసుపత్రి వైద్యుడికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.

తాజాగా 295 కరోనా కేసులు.. నలుగురు మృతి
తాజాగా 295 కరోనా కేసులు.. నలుగురు మృతి

By

Published : Aug 25, 2020, 7:51 AM IST

కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సోమవారం మంచిర్యాల జిల్లాలో 295 కేసులు నమోదవగా.. నలుగురు వైరస్‌తో మృతి చెందారు. వీరితో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 34కు చేరుకుంది. జిల్లాలో సోమవారం 1271 మందికి పరీక్షలు చేయగా 295 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది.

బెల్లంపల్లి పట్టణానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లో, నెన్నెల మండలానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు బెల్లంపల్లి ఐసోలేషన్లో, రామకృష్ణాపూర్ కు చెందిన వృద్ధురాలు హైదరాబాద్ లో, మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌కు తరలిస్తుండగా కరోనాతో మృతి చెందారు. మరోవైపు వైద్య సిబ్బందికి వైరస్‌ సోకడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెన్నూరు సామాజిక ఆసుపత్రి వైద్యుడికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి:కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!

ABOUT THE AUTHOR

...view details