జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా యువజన క్రీడల అధికారి కార్యాలయంలో హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
మంచిర్యాలలో సాదాసీదాగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు - మంచిర్యాల జిల్లా వార్తలు
మంచిర్యాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొవిడ్ నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటం మాస్కులు ధరించి క్రీడా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
మంచిర్యాలలో సాదాసీదాగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
ప్రతి ఏడాది జాతీయ క్రీడా దినోత్సవం రోజున మైదానంలో అట్టహాసంగా క్రీడలను ప్రారంభించేవారమన్నారు. కానీ కోవిడ్ నిబంధనల కారణంగా ఆర్భాటం లేకుండా మాస్కులు ధరించి క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: దేశానికి మేజర్ ధ్యాన్‌చంద్ సేవలు చిరస్మరణీయం