తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి థర్మల్​ విద్యుత్​ కేంద్రానికి జాతీయ స్థాయి పురస్కారం.. - ఎనర్జీ ఎఫిషియెంట్‌ ప్లాంట్‌ పురస్కారం

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి జాతీయ స్థాయిలో ఎనర్జీ ఎఫిషియెంట్‌ ప్లాంట్‌ పురస్కారం దక్కింది. గోవాలో మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ అధ్వర్యంలో జరుగుతున్న జాతీయ అవార్డు ప్రధానోత్సవం-2022 కార్యక్రమంలో.. దక్షిణ భారత స్థాయిలో ఉత్తమ ఎనర్జీ ఎఫిఫియెంట్‌ ప్లాంట్‌గా సింగరేణిని ఎంపిక చేశారు.

National Level Award for Singareni Thermal Power Station
National Level Award for Singareni Thermal Power Station

By

Published : Apr 27, 2022, 5:04 AM IST

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి జాతీయ స్థాయిలో ఎనర్జీ ఎఫిషియెంట్‌ ప్లాంట్‌ అవార్డు దక్కింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద నిర్మించిన సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి దక్షిణ భారత స్థాయిలో ఉత్తమ ఎనర్జీ ఎఫిఫియెంట్‌ ప్లాంట్‌గా ఎంపిక చేశారు. గోవాలో మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ అధ్వర్యంలో జరుగుతున్న రెండు రోజుల సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును జాతీయ అవార్డు ప్రధానోత్సవం-2022 కార్యక్రమంలో భాగంగా సింగరేణి చీఫ్ పవర్ ప్రాజెక్ట్స్‌ ఎన్‌వీకే విశ్వనాథరాజు, చీఫ్‌ జెఎన్‌ సింగ్‌ స్వీకరించారు.

దక్షిత భారతదేశంలో ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుమారు 75కు పైగా ప్లాంట్లలో సింగేణికి ఈ అవార్డు దక్కడం విశేషం. విద్యుత్​ ఉత్రాదనలో అతి తక్కువ నెట్​ హీట్​ రేటును నమోదు చేస్తున్ననందుకు ఈ అవార్డును ప్లాంట్​ కైవసం చేసుకుంది. సాధారణ ప్రమాణాల ప్రకారం 500 మెకావాట్ల ప్లాంట్​లో ఒక యూనిట్​ విద్యుత్​ ఉత్పత్తికి 2444 కిలో కేలరీస్​కు లోబడి ఇంధన శక్తి వాడటాన్ని ప్రామాణికంగా భావిస్తారు. సింగరేణి ప్లాంట్​ 2021-22 లో 2429 కిలో కేలరీస్​ నమోదుతో దక్షిణ భారతంలో అతితక్కువ ఇంధన వినియోగంతో విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్​గా ఎంపికైంది.

సింగరేణి ప్లాంట్‌ తన ప్రతిభా పాటవాలతో జాతీయస్థాయిలో అవార్డును అందుకోవడం పట్ల ఆ సంస్థ సీఎండీ శ్రీధర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులను, అధికారులను అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఇకపై కూడా అత్యుత్తమ స్థాయి ప్రతిభ కనబరచాలని కోరారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details