మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ప్రకృతి విపత్తుల నుంచి ఎలా బయటపడాలో అవగాహన కల్పించారు. వరదలు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, శిథిలాల కింద చిక్కుకోవడం వంటి ప్రమాదాలను ఎదుర్కోవడమెలాగో వివరించారు.
ప్రకృతి విపత్తుల నుంచి బయటపడేదెలా? - National Disaster Response Force
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా బయటపడాలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విద్యార్థులకు జాతీయ విపత్తు స్పందన దళం అవగాహన కల్పించింది.
ప్రకృతి విపత్తుల నుంచి బయటపడేదెలా?
పెద్ద పెద్ద భవనాలు నేలకూలిన సందర్భంలో శిథిలాల కింద మనుషులు చిక్కుకున్నప్పుడు కెమెరా ద్వారా ఎలా గుర్తిస్తారో చూపించారు. ఎయిర్ లిఫ్టింగ్ పరికరంతో బస్సును ఒకవైపు ఎత్తి చూపించడంతో విద్యార్థులంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు.
- ఇదీ చూడండి : ముగిసిన తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు