ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. తప్పుడు ఫలితాలు ప్రకటించి విద్యార్థుల మరణానికి కారణమైన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మండిపడ్డారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
'అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి' - RS 25 LAKHS OF EXGRATIA
ఇంటర్ బోర్డు ముందు బాధిత తల్లిదండ్రులు శాంతియుతంగా నిరసన తెలిపితే వారిని అరెస్ట్ చేయడం గర్హనీయమని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి