దేశంలోనే సింగరేణిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత అన్నారు. కార్మికుల ఆరోగ్య సమస్యల పట్ల సింగరేణి ఆసుపత్రుల్లో మరిన్ని మెరుగైన సేవలను అందిస్తూ ప్రత్యేక వైద్యులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దేశంలోనే సింగరేణిని ఆదర్శంగా తీర్చిద్దుతాం : ఎంపీ వెంకటేశ్ - Peddapalli MP Venkatesh Neta
కార్మికుల ఆరోగ్య సమస్యల పట్ల సింగరేణి ఆసుపత్రుల్లో మరిన్ని మెరుగైన సేవలందిస్తూ ప్రత్యేక వైద్యులను ఏర్పాటు చేయనున్నట్లు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో సింగరేణి డైరెక్టర్లు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
![దేశంలోనే సింగరేణిని ఆదర్శంగా తీర్చిద్దుతాం : ఎంపీ వెంకటేశ్ MP Venkatesh review with Singareni directors on singareni development](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9854287-thumbnail-3x2-a.jpg)
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి అతిథి గృహంలో.. సింగరేణి డైరెక్టర్లు, అధికారులతో ఎంపీ వెంకటేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు.. కార్మికుల సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. కార్మికులు భూగర్భ గనుల్లో పని చేస్తున్నప్పుడు కావాల్సిన ప్రధాన రక్షణ కవచాలైన హెల్మెట్, బూట్లు అందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల గతంలో కార్మికులు మృత్యువాత పడ్డారని తెలిపారు.
15 రోజుల్లో గనుల్లోని సమస్యలను గుర్తించి త్వరగా పరిష్కారానికి కృషి చేయాలని సింగరేణి సంచాలకులకు ఎంపీ వెంకటేశ్ ఆదేశాలు జారీ చేశారు.
- ఇదీ చూడండి :నేలపై పడుకొని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నిరసన..