తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లాలో యువతపైనే కరోనా ప్రభావం ఎక్కువ! - మంచిర్యాల జిల్లాలో యువతపై కరోనా ప్రభావం

మంచిర్యాల జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో యువత, మధ్యవయసు వారే ఎక్కువగా ఉంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా వైరస్​ బారిన పడుతూనే ఉన్నారు. 98శాతం యువత రికవరీ కావడం కాస్త ఊరటనిస్తోంది.

జిల్లాలో యువతపైనే కరోనా ప్రభావం ఎక్కువ!
జిల్లాలో యువతపైనే కరోనా ప్రభావం ఎక్కువ!

By

Published : Aug 12, 2020, 10:02 AM IST


మంచిర్యాల జిల్లాలో యువకులు, మధ్యవయసు వారిపై కరోనా పంజా విసురుతోంది. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం వీరే ఉంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,110 కేసులు నమోదుకాగా... ఈ నెల 10 వరకు సుమారు 448 మంది యువతకి సోకింది. అంతే కాకుండా పుట్టిన పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందర్నీ వెంటాడుతూనే ఉంది. 15 రోజుల చిన్నారికి సైతం వైరస్ సోకింది. 45 రోజులు, రెండు నెలలు, రెండేళ్ల పిల్లలు కూడా వైరస్ బారిన పడ్డారు.

కోలుకున్నవారు అధికమే
జిల్లాలో ఇప్పటి వరకు 17 మంది కరోనాతో మృతి చెందినప్పటికీ... చాలామంది కోలుకోవడం కాస్త ఊరటనిస్తోంది. జిల్లా యువతలో రికవరీ రేటు 98 శాతంగా ఉంది. అయితే 55 ఏళ్ల వయసుపైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. మృతి చెందిన వారిలో దాదాపు 15 మంది 45 ఏళ్లు దాటిన వారే ఉన్నారు. 30 ఏళ్ల లోపు ఇద్దరు మృతి చెందారు. 5 ఏళ్ళ నుంచి 12 ఏళ్ల వరకు వైరస్ సోకిన పిల్లలంతా పదుల సంఖ్యలోనే ఉన్నారు. తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూస్కోవడం శ్రేయస్కరంగా మారింది.

వయసుల వారీగా జాబితా

వయస్సు కేసులు
0-18 67
19-35 448
36-55 440
55 ఆ పైన 155

ABOUT THE AUTHOR

...view details