తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సు తనిఖీ... 32 లక్షల నగదు సీజ్ - bus

లోక్​సభ ఎన్నికల దృష్ట్యా అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. గోదావరిఖని కోల్​బెల్ట్ వంతెన వద్ద నిర్వహించిన సోదాల్లో 32 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నగదు సీజ్​ చేసిన పోలీసులు

By

Published : Apr 3, 2019, 7:51 PM IST

Updated : Apr 3, 2019, 8:37 PM IST

నగదు సీజ్​ చేసిన పోలీసులు
మంచిర్యాల-పెద్దపల్లి జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద బస్సులో తనిఖీ నిర్వహించారు. ముగ్గురు వ్యాపారస్తులు 32 లక్షల నగదును తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆసిఫాబాద్​కు చెందిన మనోజ్ అనే వ్యక్తి నుంచి 29 లక్షలు, మంచిర్యాలకు చెందిన అక్కినపల్లి రవీందర్ నుంచి 98 వేలు, మరో వ్యాపారి తిరుపతి నుంచి 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత నగదును ఎన్నికల అధికారికి అప్పగించామని డీసీపీ సుదర్శన్ గౌడ్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో సరైన ఆధారాలు చూపితే నగదును వారికి అప్పగిస్తామని లేనిచో కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.

ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నందున ఒక వ్యక్తి రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించరాదని తెలిపారు.

ఇవీ చూడండి:సీఎంను ప్రకటించిన కౌన్సిలర్​... అవాక్కైన మంత్రి..!

Last Updated : Apr 3, 2019, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details