తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగా బతుకమ్మ ఆట.. కరోనాతో తగ్గిన సందడి - corona impact on Bathukamma latest News

దసరా పండుగకు నెలరోజుల ముందే బతుకమ్మ పండుగ రావడంతో మహిళలు ఆడిపాడారు. సమూహికంగా ఆడే బతుకమ్మకు కరోనా వ్యాప్తి నేపథ్యంలో సందడి తగ్గింది.

నిరాడంబరంగా బతుకమ్మ ఆట.. కరోనాతో తగ్గిన సందడి
నిరాడంబరంగా బతుకమ్మ ఆట.. కరోనాతో తగ్గిన సందడి

By

Published : Sep 18, 2020, 10:06 AM IST

నెలరోజుల ముందుగానే బతుకమ్మ పండుగ రావడంతో మహిళలు ఆడిపాడారు. ఉదయం నుంచే చిన్నా పెద్దా తేడా లేకుండా రంగురంగుల పూలు సేకరించి పాటలు పాడుతూ బతుకమ్మలను పేర్చారు.

పరిమితంగానే..

కరోనా నేపథ్యంలో మహిళలు పరిమిత సంఖ్యలో వచ్చి బతుకమ్మ ఆడటం కనిపించింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని తాండూరు, నెన్నెల, కాసిపేట భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో గతంలో కంటే సందడి చాలావరకు తగ్గింది. నిరాండబరంగానే బతుకమ్మ ఆడారు.

ఇవీ చూడండి :తెలంగాణ సాయుధ పోరాటం మతకోణంలో చూడరాదు : బృందాకారత్

For All Latest Updates

TAGGED:

Bathukamma

ABOUT THE AUTHOR

...view details