మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడెం జడ్పీహెచ్ఎస్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్‌ను నిర్వహించారు. విద్యార్థులు పోలింగ్ నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులు పోటీ చేశారు. 90 మంది విద్యార్థలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అనంతరం పోలింగ్ బాక్స్‌లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించి... ఫలితాలను ప్రకటించారు.
ఈ మాక్ పోలింగ్‌లో పోటీచేయడం ఆనందంగా ఉందని పోటీ చేసిన విద్యార్థులు తెలిపారు. ఓటింగ్, కౌంటింగ్ విధానం గురించి పూర్తిగా అవగాహన వచ్చిందని చెప్పారు. తనకు ఎక్కువ మంది ఓటు వేసి గెలిపించారని కె.మహేష్ అనే విద్యార్థి హర్షం వ్యక్తం చేశాడు. మాక్ పోలింగ్ వల్ల ఎన్నికల ప్రక్రియ గురించి తెలుసుకున్నట్లు నందిని అనే విద్యార్థి చెప్పింది. మాక్ పోలింగ్ వల్ల మొదటి సారి ఓటు వినియోగించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది.